etula neeku sthuthu | ఎటుల నీకు స్తుతు | Andhra Kraisthava Keerthanalu Song number 23 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 23

ఎటుల నీకు స్తుతు లొనర్తుము యెహోవ తనయ యెటుల నీకుఁ
నుతు లొనర్తుము పటుతర పాపంబులనెడి పంకమందుఁజిక్కి మదిని
దిటముఁ జెడిన మమ్ముఁ బ్రోచి దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల||

1.
పాపకూపమందు నుండగాఁ బాపావిమోచ దాపుఁజేర్చి కాపుఁ
జూపితి శాపగ్రస్తులైన మా శాపము విముక్తిఁజేయ నీ పవిత్ర రక్తమే
నా ప్రాపుగా నొసంగితివి ||యెటుల||


2.
భార భరితమైన యాత్మల భారమున దీసి భూరి సౌఖ్యములతో
నింపను భారకుండ ఘోరమైన శ్రమలనొంది మరణమొంది తిరిగిలేచి
నీవు ధాత్రి మహిమ నొందినట్టి దేవా ||యెటుల||


3.
నీతిహీనులమై యుండఁగా నో కర్త మాదు బీతులన్నిఁబాపి నీ కృపన్
నీతి రక్షణవస్త్రములను భాతిగ ధరింపజేసి భూతలంబునందు నిన్ను
ఖ్యాతిగ సేవింపఁజేసితి ||యెటుల||


4.
నిన్నుఁజేరి నిర్చలుండనై యీ భూమియందు నిన్నుఁ బోలి
నడుచుకొనుటకై తిన్నని మార్గమును జూపి అన్ని కీడులను జయింపఁ
బన్నుఁగ విమలాత్మశక్తి నున్నతముఁగ నిడిన యేసూ ||యెటుల||


5.
పరమ రాజ్యమందు నిరతము నీతోడనుండఁ కరుణతోడ నెంచుకొంటివి
తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ
జేర్చియందు సుఖము దిరముగా నొసంగుదేవ ||యెటుల||

 

etula neeku sthuthu lonarthumu yehoava thanaya yetula neekuAO
nuthu lonarthumu patuthara paapMbulanedi pMkamMdhuAOjikki madhini
dhitamuAO jedina mammuAO broachi dhikkuAOjoopinatti yaesoo ||yetula||

1.
paapakoopamMdhu nuMdagaaAO baapaavimoacha dhaapuAOjaerchi kaapuAO
joopithi shaapagrasthulaina maa shaapamu vimukthiAOjaeya nee pavithra rakthamae
naa praapugaa nosMgithivi ||yetula||


2.
bhaara bharithamaina yaathmala bhaaramuna dheesi bhoori saukhyamulathoa
niMpanu bhaarakuMda ghoaramaina shramalanoMdhi maraNamoMdhi thirigilaechi
neevu Dhaathri mahima noMdhinatti dhaevaa ||yetula||


3.
neethiheenulamai yuMdAOgaa noa kartha maadhu beethulanniAObaapi nee krupan
neethi rakShNavasthramulanu bhaathiga DhariMpajaesi bhoothalMbunMdhu ninnu
khyaathiga saeviMpAOjaesithi ||yetula||


4.
ninnuAOjaeri nirchaluMdanai yee bhoomiyMdhu ninnuAO boali
naduchukonutakai thinnani maargamunu joopi anni keedulanu jayiMpAO
bannuAOga vimalaathmashakthi nunnathamuAOga nidina yaesoo ||yetula||


5.
parama raajyamMdhu nirathamu neethoadanuMdAO karuNathoada neMchukoMtivi
thirigi vachchi mammunu mee chiraprakaasha puramunMdhuAO thvaragAO
jaerchiyMdhu sukhamu dhiramugaa nosMgudhaeva ||yetula||

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment