koodikoni yunnaamu | కూడికొని యున్నాము | Andhra Kraisthava Keerthanalu Song number 18 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 18

కూడికొని యున్నాము సంఘ ప్రభో కూడికొని యున్నాము తోడ
నుండెద ననుచు నమ్ముచు దొడ్డ దగు నీ పాద సన్నిధి ||కూడికొని||

1.
ఎచట నా ప్రియ భక్తులెలమిఁ గూడియున్న నచటికి నేతెంతునని పల్కితి
విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించు
మీ యేసు క్రీస్తునాధా ||కూడికొని||


2.
గత కాలమందున గాని చేఁతలచే దుర్గతి నొంది యుండఁగాఁ
గనుఁగొంటివి శత సంఖ్య గల పాపచయ మీవు క్షమియించి యతి
శాంతి నిడితివి యాత్మస్వరూపా ||కూడికొని||


3.
నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందుఁ బరతఁ
గల్గి యరులకు శుభములు నిరతంబుఁ జేయఁగఁ దిరత మా కొసఁగుము
దేవుని ప్రియ తనయా ||కూడికొని||


4.
అన్ని శోధనముల నన్ని విపత్తుల నన్ని కాలములందు నాదరించి
నిన్ను నమ్మిన జనుల నీ సందిటను జేర్చి పన్నుగఁ గాపాడు
ప్రభు యేసు క్రీస్తు ||కూడికొని||


5.
అమలుఁడ నగు నన్ననుకరించుండనుచు నాన తిచ్చినాఁడ వాత్మజులకు
నమల మార్గము నందు నరుగంగ మాకీవు విమలాత్మ దయసేయు
వేగంబు మా తండ్రీ ||కూడికొని||

 

koodikoni yunnaamu sMgha prabhoa koodikoni yunnaamu thoada
nuMdedha nanuchu nammuchu dhodda dhagu nee paadha sanniDhi ||koodikoni||

1.
echata naa priya bhakthulelamiAO goodiyunna nachatiki naetheMthunani palkithi
vichata nuMdu mammu veekShiMchi krupachaetha nipudu dheeviMchu
mee yaesu kreesthunaaDhaa ||koodikoni||


2.
gatha kaalamMdhuna gaani chaeAOthalachae dhurgathi noMdhi yuMdAOgaaAO
ganuAOgoMtivi shatha sMkhya gala paapachaya meevu kShmiyiMchi yathi
shaaMthi nidithivi yaathmasvaroopaa ||koodikoni||


3.
nirathamu nee praema nenaruna DhyaaniMchi parama DharmamulMdhuAO barathAO
galgi yarulaku shubhamulu nirathMbuAO jaeyAOgAO dhiratha maa kosAOgumu
dhaevuni priya thanayaa ||koodikoni||


4.
anni shoaDhanamula nanni vipaththula nanni kaalamulMdhu naadhariMchi
ninnu nammina janula nee sMdhitanu jaerchi pannugAO gaapaadu
prabhu yaesu kreesthu ||koodikoni||


5.
amaluAOda nagu nannanukariMchuMdanuchu naana thichchinaaAOda vaathmajulaku
namala maargamu nMdhu narugMga maakeevu vimalaathma dhayasaeyu
vaegMbu maa thMdree ||koodikoni||

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment