1.ఓ ప్రభుండా నిన్ నుతీంచుచున్నాము వినయముతోడ మా ప్రభుండ వంచు నిన్ను మానక మేమొప్పుకొందు ||మో||
2.నిత్యుఁడవౌ తండ్రి లోకము నిన్నారాధించుచు నుండు సత్యదూతల్ మోక్షమందు సర్వ ప్రధానుల్ సుభక్తిన్ నిత్య మేక కంఠముతోడ నిన్ గొనియాడుచున్నారు ||ఓ||
3.పరిశుద్ధ, పరిశుద్ధ పరిశుద్ధ,సేనల దేవా ధరపరలోకంబులు నీ వర మహిమతో నోప్పునటంచు ||నో||
4.కెరూబుల్ సెరూపుల్ నిన్నుఁ గీర్తించుచున్నారహహా సారెకున్ నిన్నపొస్తలుల సంఘము స్తోత్రించుచుండు కూరిమిన్ బ్రవక్తల సంఘము కొనియాడుచు నిన్ నుతియించు ||నో||
5.మా మహా జనకా నిను మాన్యుఁడౌ పుత్రున్ బహు ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొప్పుకొనున్ ||ఓ||
6.నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా గర్భంబున బుట్టుట బహుదీనంబనక చావు శ్రమ నోడించి సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||
7.నీవు దేవుని కుడి పార్శ్వంబున నిత్యము మహిమాసీనుఁడవు నీవు మా న్యాయాధిపతివై రావలయునని నమ్ముచుందుము పావనంబౌ నీ రక్తంబున సేవకులకుఁ దోడ్పడు మిపుడే ||ఓ||
8.నిత్య మహిమములో నిఁక నీదు భక్తులతోన గత్యముగ లెక్కించుము వారలఁ గని రక్షించుమి నీ సుజనంబున్ ||ఓ|
9.నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సుజీవమిడి వారలఁ బాలించి లేవఁగ నెత్తుము సతతము ప్రీతిన్ ||ఓ||
10.ఓ ప్రభువా పాపములో నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||
11.ఓ ప్రభుండా నిన్ను నమ్మి యున్న మాకుఁ బ్రేమఁ జూపు శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి సిగ్గునొంద నీయకుము ||ఓ||
-
Oh prabhunda ni nuthinchu – chunnaamu vinayamu thoada –
maa prabhunda vanchu ninnu – maanaka mae moppukondhuOh prabhunda
1 Nithyudou thandri loakamu – ninnaaraadhinchuchu nunduSathya
dhuuthal moakshamandhu – sarva pradhaanul subhakthin Nithya
maeka kantamu thoada – nin koni yaadu chunnaaruOh prabhunda
2 Parisudhdha, parisudhdha – parisudhdha, saenala dhaevaaDhara
paraloakambulu nii – varamahimatho noppu natanchuOh prabhunda
3 Keruupul seruupul – ninnu kiirthinchu chunnaa rahahaa-
Saarekun ninnapoasthalula-sanghamu sthoathrinchu chundun-
Kuurimin pravakthala sanghamu – koniyaaduchu ninnuthinchuOh prabhunda
4 Maa mahaa janakaa- ninu – maanyudou puthrun –
bahu – praema gala maa pari sudhdhaathmanu – priithithoa sanghamu
bhuvi noppukonunOh prabhunda
5 Niivae kriisthu raajavu – nithya kumaarudavu- nii vilaloa maanavulanu-
kaavaga buunina yapudu – paavana kanyaa – garbhambuna puttuta –
Bahu dhiinambanaka – chaavu srama noadinchi- sajjanulaku dhivi therachithivaeOh prabhunda
6 Niivu dhaevuni kudi paarsambuna – nithyamu mahimaa siinudavu –
Niivu maa nyaayaadhi pathi vai – raavalayunani nammu chundhumu –
Paavanambou nii rakthambuna – saevakulaku thoadpadu mipudaeOh prabhunda
7 Nithya mahimamuloa –nika- niidhu bhakthulathoa –na –
gathyamuga lekkinchumu vaarala – gani rakshinchumi nii sujanambunOh prabhunda
8 Niivu dhiivinchi – nii nithya svaasthyambu –su-jiiva midi vaarala paalinchi –
laevaga neththumu sathathamu priithinOh prabhunda
9 Oh prabhuvaa paapamuloa – nundakundaga thoadpadumuMaa
prabhuvaa karuninchu – mamu karuninchumu dhaya thoadanOh prabhunda
10 Oh prabhunda ninnu nammi – yunna maaku praema chuupu –
Srii prabhundaa ninnae nammithi – siggu nondha niiyakumuOh prabhunda
0 comments