Gaanamu chaeyudu sukiirthananu - గానముఁ జేయుఁడు సుకీర్తనను - Andhra Kraisthava Keerthanalu Song number 2- ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 2

1.గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగన                                                                                                                ||గానము||

2.తన్నామము నుతించి యతని రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము||

3.ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||

4.పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము||

5.పరిపాలించుచున్నాఁడనుచు తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము||

6.ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము||

7.జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||

 

  • Gaanamu chaeyudu sukiirthananu=
    Yohoavanu guurichi krotha gaanu rakthi gaanu

     

    Gaanamu

    1. Thannaamamu nuthinchi athani-raksha- chennuga saarebra –siddhamu chaesi =
    pannuga nanyulaloa thanamahima-yan-dhunnatha chithramu-lanu chaatandi

    Gaanamu

    2.Ghanathayu mahathyamunu-dha-dhghanani yedhuta nundu- ghana balamunu =
    vinathamou soundharyamunu –na- thanivi nirmala sthala- muna vilasillu Gaanamu

    3,Parisuddhaalankaaramuthoa-naa – paramaathmaaraadhana –parulai yundandi =
    dharani sakala janulaaraa – loaka – guruni yedhuta bhiithi –gonuchu nundandi

    Gaanamu

    4.Paripaalinchu chunnaadanuchu thoadi –narulathoa cheppudi-ddhara gadhakunda =
    sthiramuga chaeyu sathyamugaa- janula- karimuri gaanu nyaa-yamu vimarsinchu

    Gaanamu

    5,Eamanina naa mahaathmundu – vachchu – nii mahiki nyaayamu –naerparachutaku =
    bhuumi janulaku niithi sathya-mula – thoa minchu nyaaya men-thoa vimarsinchu

    Gaanamu

    6.Janulaaraa aa yohoavaaku- mahi –manu balamunu samarpanamu chaeyandi vinayamuthoa kaanukalanu – thiisi- koni thathpraakaara mandhuna vasiyimpandi

    Gaanamu

0 comments

Leave a comment