goppa dhaeva | గొప్ప దేవ | Andhra Kraisthava Keerthanalu Song number 60 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 60

గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి
తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత
నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము ||గొప్ప||

1.
నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు
భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు
నిలిపి కావు మనుచు వేఁడుకొందు ||గొప్ప||


2.
చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు
సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు
మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు ||గొప్ప||


3.
విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు
చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ
గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని ||గొప్ప||


4.
మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే
సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ
బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి ||గొప్ప||

 

goppa dhaeva naaku thMdrivi yaakaashamMdhu goppa dhaeva naakuAO dhMdrivi
thappakuMda vaththu needhariki yaesu naamamMdhu goppa karuNa chaetha
nannippudu thagAO jaerchukonumu ||goppa||

1.
neevu migula goppa vaaAOdavu naa sruShti kartha yeevu lepudu nichchu vaaAOdavu
bhaavamMdhu ninuAO dhalMchi paavanaathma naaku nichchi jeevamaargamMdhu
nilipi kaavu manuchu vaeAOdukoMdhu ||goppa||


2.
chinnavaani nMgi praarThana nee loakamMdhu munnu dhayanu ninna vaaAOdavu
sannuthuAOdagu yaesu needhu sanniDhi sunnaaAOdu gaana nannuAO ganikariMchu
manuchu ninnu nammi vaththu nipudu ||goppa||


3.
viluva galgu needhu naajnYlu naa hrudhayamMdhu balu viDhamulAO dhalAOchu
chuMdhunu balukulMdhuAObanulayMdhu balamuAO joopi ninnuAO
golichi yilanu ninnuAO breethiparuthu nalayaka nee karuNa meyini ||goppa||


4.
meeAOdhi raajyamMdhuAO jaerchumu karuNaasamudhra beedha naina nannuAO garuNachae
soadharulanu goodikonuchu moadha moppAOga needhu saevAO
baadhukonuchu nuMdhunu nee paadhapadhmamulanubatti ||goppa||

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment