Kriisthu yaesunaku mangalam | మంగళమే యేసునకు | Andhra Kraisthava Keerthanalu Song number 76 | ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాట నెంబర్ - 76

మంగళమే యేసునకు – మానుజావతారునకు (3)
శృంగార ప్రభువునకు (2)
క్షేమాధిపతికి మంగళమే           ||మంగళమే||

 

పరమ పవిత్రునకు – వర దివ్య తేజునకు (3)
నిరుపమానందునకు (2)
నిపుణ వేద్యునకు మంగళమే           ||మంగళమే||

దురిత సంహారునకు – వర సుగుణోదారునకు (3)
కరుణా సంపన్నునకు (2)
జ్ఞాన దీప్తునకు మంగళమే           ||మంగళమే||

సత్య ప్రవర్తునకు – సద్ధర్మ శీలునకు (3)
నిత్య స్వయంజీవునకు (2)
నిర్మలాత్మునకు మంగళమే           ||మంగళమే||

యుక్త స్తోత్రార్హునకు – భక్త రక్షామణికి (3)
సత్య పరంజ్యోతి యగు (2)
సార్వభౌమునకు మంగళమే           ||మంగళమే||

నర ఘోర కలుషముల – నురుమారంగ నిల (3)
కరుదెంచిన మా పాలి (2)
వర రక్షకునకు మంగళమే           ||మంగళమే||

పరమపురి వాసునకు – నర దైవ రూపునకు (3)
పరమేశ్వర తనయునకు (2)
బ్రణుతింతుము నిన్ను మంగళమే           ||మంగళమే||

 

 

Songs List

ANdhra Kraisthava Keerthanalu

1 - 100
1. Anni kalabula nunna
2. Deva naa deva
3. adhukonumayya

Manufacturing

Our products are manufactured both locally and globally. We carefully select our manufacturing partners to ensure our products are high quality and a fair value.

0 comments

Leave a comment